Home > Featured > ఆ గోమాత ఇక లేదు.. ఆ ఏనుగే చంపేసింది..

ఆ గోమాత ఇక లేదు.. ఆ ఏనుగే చంపేసింది..

Cow

ఆవు నడుం విరిగి విలవిలలాడిపోతున్నా మదపుటేనుగు ఏమాత్రం కనికరించలేదు. 15 రోజుల క్రితం దాడి చేసి వెళ్లి తర్వాత తిరిగి మళ్లీ వచ్చి అచేతనంగా పడి ఉన్న ఆవును చంపేసింది. తన తొండంతో బలంగా కొట్టి ఆయువు తీసింది. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఓ ఆవు అచేతన స్థితిలో పడి ఉన్నప్పటికీ తన లేగదూడకు పాలిస్తూ అమ్మ ప్రేమను చాటిన సంగతి తెలిసిందే. ఈ వార్త అందరిని కలచివేసింది. తాజాగా ఆ ఆవు మరోసారి ఏనుగు దాడిలో మరణించింది.

rr

పగబట్టినట్టుగా తిరిగి పశువుల పాక వద్దకు వచ్చి ఆదివారం రాత్రి మళ్లీ ఆవుపై దాడి చేసి చంపేసింది. తర్వాత కళేబరాన్ని కొంత దూరంలో విసిరేసింది. పాకకు సమీపంలో ఉన్న కృష్ణమూర్తిపై కూడా దాడికి ప్రయత్నించింది. అప్పటికే అక్కడికి అటవీశాఖ సిబ్బంది వచ్చి దాన్ని అడవిలోకి తరిమేశారు. అయితే 15 రోజుల తర్వాత కూడా ఏనుగు తిరిగి అక్కడికే వచ్చి దాడి చేయడంతో పగపట్టిందని అంతా అనుకుంటున్నారు. అయితే ఏనుగులు పగబట్టడం ఉండదని మదమెక్కిన ఆడ ఏనుగులు కనిపించిన వాటిపై దాడులు చేస్తుంటాయని అటవీశాఖ అధికారులు వివరిస్తున్నారు.

Updated : 17 Sep 2019 7:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top