Elephant returns child’s shoe that fell inside its enclosure. Watch viral video
mictv telugu

ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన చిన్నారి చెప్పు.. ఆ ఏనుగు ఏం చేసిందంటే..

August 18, 2022

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన ఆసక్తికర, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని నవ్విస్తే.. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏనుగు ప్రవర్తన నెటిజన్లను ఫిదా చేసింది. చైనాలోని ఓ జంతు ప్రదర్శనశాలలో ఈ వీడియోను చిత్రీకరించారు.

జూలోని ఏనుగులను చూస్తున్న సమయంలో వచ్చిన ఓ చిన్నారి చెప్పు అనుకోకుండా ఆ ఏనుగులు ఉండే ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. ఆ చెప్పును చూసిన ఏనుగు తన తొండంతో ఆ చెప్పును తీసి బయట ఉన్న చిన్నారికి అందించింది. పర్యాటకులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఏనుగు ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.