ఈ ఏనుగు ఏం చేస్తోంది? ఏ బ్రాండ్ తాగుతోంది? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ఏనుగు ఏం చేస్తోంది? ఏ బ్రాండ్ తాగుతోంది?

March 24, 2018

ఏనుగులు చాలా తెలివైన జంతువులు. పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తుంటాయి. ఆహారం, గున్నల సంరక్షణ, శత్రువుపై ఎదురుదాడి వంటి వాటిలో అవి గట్టిపిండాలు. కాస్త శిక్షణ ఇస్తే అవి మనం చెప్పినట్లు పనిచేస్తాయి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది కాబట్టి. ఈ గజరాజు ధూమపానం చేస్తున్నాడని జనం ఒకటే గోల పెడుతున్నారు. అడవిలో దానికి సిగరెట్లు ఎలా వచ్చాయని, దాని మూతి కాలదా? అని నానా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు విషయం తెలుసుకుని హాశ్చర్య పోతున్నారు.

ఈ ఏనుగు మన దేశానిదే. కర్ణాటకలోని నాగర్‌హోల్ జాతీయ అభయారణ్యంలో ఉంది. రెండేళ్ల కిందట జీవశాస్త్ర నిపుణుడు డాక్టర్ వరుణ్ గోస్వామికి ఇలా కంటపడింది. ఏనుగేంటి, పొగేంటి అని ఆయన అధ్యయనం చేశారు. నిజానికి ఈ ఏనుగు తింటున్నది బొగ్గు. అడవిలో కార్చిచ్చు తర్వాత ఆరిపోయిన బొగ్గును ఇలా బుక్కుతోంది. బొగ్గుపై ఉన్న బూడిదను ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తోంది. దీంతో అది మనకు పొగతాగుతున్నట్లు కనిపిస్తోంది. బొగ్గులో ఎలాంటి పోషకాలూ లేకపోయినా అది విరోచనకారిగా పనిచేస్తుందని, ఏనుగులు అందుకే ఇలా తింటుండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.