ELEPHANTAS ATTACK IN PARVATIPURAM
mictv telugu

పార్వతీపురంలో గజరాజుల బీభత్సం..రైతులపై దాడి

November 2, 2022

పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా తిష్ట వేసిన ఏనుగుల గుంపు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటు పనిచేసే రైతులపై సైతం దాడులకు దిగుతున్నాయి.తాజాగా ప‌ణుకువ‌ల‌స గ్రామంలోని పొలంలో ప‌నిచేసుకుంటున్న ఇద్ద‌రు రైతుల‌పై ఏనుగులు దాడి చేశాయి.. ఈ ఘ‌ట‌న‌లో తండ్రి, కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంట‌నే స్థానికులు ఏనుగుల‌ను చెద‌ర‌గొట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. ఏనుగుల గుంపు సంచారంపై స్థానికులు భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఏనుగుల గుంపును తరిమివేయాలని కోరుతున్నారు.