ఏనుగుల డే హైదరాబాద్‌ జూలో ఇలా.. అది పేద్దది ఎక్కడంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏనుగుల డే హైదరాబాద్‌ జూలో ఇలా.. అది పేద్దది ఎక్కడంటే.. 

August 12, 2020

Elephants day celebrations in hyderabad.

ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఓ రోజు అంటూ ఉంది. బతికున్న జీవులకు, బంధాలకు, ప్రాణంలోనే మిషిన్లకు ఇలా ప్రతిదానికి ఓ రోజు ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఆగస్టు 12ను ప్రపంచ ఏనుగు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు జూ పార్కు నిర్వాహకులు తమ వద్ద ఉన్న ఏనుగులను చక్కగా ముస్తాబు చేసి సెలెబ్రేషన్స్ చేస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న ఐదు ఏనుగులతో ఈరోజు ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించారు.

 

 

రాగి, బియ్యంతో తయారు చేసిన కేకుతో పాటు పండ్లు, కూరగాయలు, మొలకలు, మొక్కజొన్నలు ఉన్న కేకును తయారు చేసి ఏనుగులకు అందించారు. వీటితోపాటు చెరుకు, పైనాపిల్‌, కొబ్బరి, పచ్చటి గడ్డి, బెల్లం మొదలగు ఏనుగులకు ఇష్టమైన ఆహార పదార్థాలను కూడా పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను నెహ్రూ జూ పార్క్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత బరువైన ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏనుగు 8వేల కిలోల బరువు ఉంటుందని తెలుస్తోంది.