ఏం తింటున్నాయో చూడండి! - MicTv.in - Telugu News
mictv telugu

ఏం తింటున్నాయో చూడండి!

September 4, 2017

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు  అవుతారని సామెత. పశ్చిమ బెంగాల్ లోని బామన్ పోఖరి అడవుల్లో తిరుగుతున్న ఏనుగులే దీనికి ఉదాహరణ. అక్కడి ఏనుగులు ఇటీవల గ్రామాల్లో చొరబడుతున్నాయి. ఊరి శివార్లలో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తినేస్తున్నాయి. ప్లాస్టిక్ కాగితాలు, జింక్ ఫుడ్ వంటివాటిని మెక్కేస్తున్నాయి. క్రమంగా వీటికి అదొక అలవాటుగా మారిపోయింది. ఎంతగా.. అంటే చుట్టూ చక్కని పచ్చగట్టి కనిపిస్తున్నా దాన్ని వదిలేసి ప్లాస్టిక్ కవర్లను తింటున్నాయి.  ప్లాస్టిక్ కవర్లలోని మిగిలిపోయిన ఆహార పదార్థాల వాసనను గజరాజులు ఇష్టపడుతున్నాయి. చెత్త గుట్టను మరీ కెలికి దొరికిన దాన్ని దొరికినట్లు తినేస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ ఆహారం వల్ల ఏనుగులకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలియడం లేదు. తిన్న ఏనుగులు మళ్లీ అడవుల్లోకి వెళ్తుండటంతో వాటి పరిస్థితేమిటిలో తెలియడం లేదు.