Elephants from Oscar-winning documentary The Elephant Whisperers Gone Missing
mictv telugu

ఆస్కార్ అందుకున్న ఏనుగులు మిస్సింగ్..!

March 13, 2023

Elephants from Oscar-winning documentary The Elephant Whisperers Missing

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’..ప్రస్తుతం ఈ భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం పేరు అంతర్జాతీయంగా మారు మ్రోగిపోతోంది. అందుకు కారణం ఆస్కార్ వేడుక‌ల్లో సత్తా చాటడమే. బెస్ట్ డాక్యుమెంట‌రీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ ఆస్కార్ అవార్డు అందుకుంది. భారతీయ షార్ట్ ఫిలిమ్ విభాగంలో తొలి అస్కార్ అవార్డును అందుకొని చరిత్ర సృష్టించింది. ఇక ఫిలింకు సంబంధించి మరో విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీకి డైర‌క్ట‌ర్ కార్తికీ గొన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. ఆమె ఐదేళ్లపాటు కష్టపడి తన టీం సభ్యులతో కలిసి ఏనుగులతో జీవించారు. అనాథలైన రెండు ఏనుగు పిల్లల సంరక్షణకు అంకితమైన బొమ్మన్, బెల్లీ దంపతుల ప్రయాణాన్ని అద్భుతంగా ప్రేక్షకులకు చూపించారు. ఆ రెండు ఏనుగులు కూడా సినిమాలో అద్భుతంగా నటించాయి. చిత్ర బృందానికి కష్టానికి ఫలితంగా నేడు ఆస్కార్ అవార్డును ది ఎలిఫెంట్ విస్పరర్స్ గెలుచుకుంది. అవార్డు గెలుచుకున్నందుకు ఏనుగుల సంరక్షకుడు బొమ్మన్ ఆనందం వ్యక్తం చేశాడు. తన గురించి అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలా చేసిన దర్శకురాలు కార్తికీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇదే సమయంలో బొమ్మన్ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. సినిమాలో నటించిన రెండు ఏనుగులు కనిపించకుండా పోయాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కొంతమంది మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులను తరుముతూ రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయినట్లు వివరించాడు. ఆ ఏనుగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపాడు.