Home > Featured > ఎంత కష్టం.. గోడ దూకిన ఏనుగులు (వీడియో)

ఎంత కష్టం.. గోడ దూకిన ఏనుగులు (వీడియో)

పిల్లులు,కోతులు గోడ దూకడం చూస్తాం. కానీ ఎక్కడైనా ఏనుగు దూకిన సంఘటనలు ఉన్నాయా అంటే అరుదు అనే చెప్పాలి. కానీ ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఏనుగుల గుంపు ఒకదాని తర్వాత ఒకటి ఇలా గోడను దూకాయి. ఇదంతా ఏదో సినిమాలో జరిగిన విషయం మాత్రం కాదు. నిజ జీవితంలో కర్నాటకలోని హన్సూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చాలా రోజుల క్రితం జరిగిన సంఘటనను ఇటీవల ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీన్ కశ్యన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది.

అడవిలో తిరిగే ఓ ఏనుగుల గుంపు దారి తప్పి ఓసారి హన్సూర్ గ్రామంలోకి వచ్చింది. అటూ ఇటూ తిరుగుతూ కొంత దూరం వెళ్లాక వాటికి దారి కనిపించలేదు. ఏం చేయాలో తోచని ఆ ఏనుగులు ఒక్కొక్కటిగా పక్కనే ఉన్న గోడను దూకి అడవుల్లోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఏ ముసలి ఏనుగు తన బిడ్డను గోడదాటించడానికి ఏంతో కష్టపడి చివరికి ఎలాగోలా బయటపడింది. ఆ వ్యవహారం అంతా అక్కడి స్థానికులు భయం భయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోపై నెటిజన్లు ఎవరికి నచ్చినట్టుగా వారు స్పందిస్తున్నారు. ఏనుగుల మంద ఇలా గొడదూకడం చూడటం మాత్రం ఇదే మొదటిసారి అంటూ పోస్టులు పెడుతున్నారు.

Updated : 13 Sep 2019 3:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top