ఫుట్‌బాల్ ఆడుతూ సందడి చేసిన గజరాజులు - MicTv.in - Telugu News
mictv telugu

ఫుట్‌బాల్ ఆడుతూ సందడి చేసిన గజరాజులు

October 23, 2019

గ్రౌండ్‌లో గజరాజులు చేసిన సందడి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఫుడ్‌బాల్ ప్లేయర్స్ ఆడినట్టుగా గేమ్ ఆడుతూ అవి రిలాక్స్ అయ్యాయి. ఏనుగులు   ఫుట్‌బాల్ ఆడుతుంటే సందర్శకులు వాటిని చూసి తెగ సంబరపడిపోయారు. కొడుగు జిల్లాలోని దుబారే ఎలిఫెంట్ క్యాంప్‌లో జంబోలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. కాలితో ఫుడ్‌బాల్ తన్నుతూ.. గోల్స్ చేయడం చూసి పర్యాటకులు మైమరచిపోయారు. 

మైసూరు దసరా ఉత్సవాల  కోసం ఏనుగులను దుబారే  ఎలిఫెంట్ శిబిరంలో ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో భాగంగా వీటికి నదిలో స్నానం చేయడం, షికారు చేయడం, ఫుట్‌బాల్ ఆడటం వంటివి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఇటీవల ఈ క్యాంప్ నుంచి ఆరు ఏనుగులను దసరా ఉత్సవాల కోసం మైసూర్ తీసుకువెళ్లారు. పది రోజుల ఉత్సవాలు ముగిసిన తర్వాత తిరిగి వాటిని క్యాంప్‌నకు తీసుకువచ్చారు. అక్కడికి వచ్చిన వెంటనే ఇన్ని రోజులు జనావాసాల్లో అలసిపోయిన గజరాజులు హాయిగా ఫుట్‌బాల్ ఆడుతూ.. రిలాక్స్ అయ్యాయి. దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హాజరయ్యారు.