తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఏకంగా 11 మంది భక్తులు మంటల్లో కాలిబూడిదైపోయిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. తంజావూరులోని కరిమేడు అప్పర్ ఆలయ రథం ఊరేగింపులో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 11మంది భక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూాడా ఉంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రథోత్సవంలో పాల్గొన్న రథం గుడికి తిరిగి వస్తుండగా, ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై, గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆ మంటల్లో రథం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.