Elizabeth's drunk tea bag was sold for 9.5 lakhs.
mictv telugu

తాగిపడేసిన టీ బ్యాగ్ ధర రూ. 9.5 లక్షలు.. స్పెషాలిటీ ఏంటంటే

September 19, 2022

ఈ నెల 8వ తేదీన చనిపోయిన మహారాణి ఎలిజబెత్ చనిపోయాక కూడా తన స్టామినాను నిరూపించుకున్నారు. ఆమె తాగి పడేసిన టీ బ్యాగ్ వేలంలో ఏకంగా రూ. 9.5 లక్షలకు అమ్ముడుపోయింది. డాలర్లలో చెప్పాలంటే 12 వేల డాలర్లు. ఆ టీ బ్యాగ్ కూడా ఈ మధ్యన వాడింది కాదు. దాదాపు పాతికేళ్ల కింద 1998లో ఆ టీ బ్యాగ్‌ను ఎలిజబెత్ వాడుకున్నారు. ఈ టీ బ్యాగ్‌కు రాయల్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికెట్స్ ఇచ్చిన సర్టిఫికెట్ దీనికి జోడించారు. అమెరికాలోని జార్జియాలో నివసించే ఓ వ్యక్తి ఈ టీ బ్యాగుని విండ్సర్ ప్యాలస్ నుంచి చేజిక్కించుకొని ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టాడు. ఇంత ధర రావడం చూసి షాక్ తిన్నాడు. ఇదే కాక, ఎలిజబెత్ మైనపు విగ్రహాన్ని అమ్మకానికి పెట్టగా, 15,900 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 12.60 లక్షలు పలికింది. ఇంత ధర పలకడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.