మరోసారి కుక్కతో కలిసి తిక్క పని చేసిన మస్క్..ఏం చేశాడంటే..!! - Telugu News - Mic tv
mictv telugu

మరోసారి కుక్కతో కలిసి తిక్క పని చేసిన మస్క్..ఏం చేశాడంటే..!!

February 15, 2023

Elon Musk announced the new CEO of Twitter

గతేడాది ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ నిరంతరం ఏదొక మార్పులు చేస్తూనే ఉన్నారు. తాను కొత్త సీఈవోకోసం వెతుకుతున్నానని గతంలోనే చెప్పాడు మస్క్. తాను చెప్పినట్లుగానే ట్విట్టర్ కు కొత్త సీఈవోను ప్రకటించారు. మస్క్ కు తిక్క పనులు చేయడం కొత్తేమీ కాదు కదా. అందుకే ఇప్పుడు కూడా మరోసారి తిక్క పని చేస్తూ వార్తల్లో నిలిచాడు. ట్విట్టర్ కు కొత్త సీఈవో మనిషి కాదు తన పెంపుడు కుక్క అని ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు.

ఇది మస్క్ పెంపుడు కుక్క ఫ్లోకి. ఇది వ్యక్తుల కంటే చాలా మెరుగైనదని మస్క్ ట్వీట్ చేశాడు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్ కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్ లను ట్విట్టర్ నుంచి బయటకు పంపించారు.సీఈవో కుర్చిలో తన పెంపుడు కుక్కను కూర్చోబెట్టి తీసిన ఫొటోలను పోస్టు చేశాడు. ఇప్పుడా ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. దాదాపు లక్ష మంది లైక్ చేశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.