Elon Musk Becomes 'Temporary' CEO Of Twitter After Firing All Board Of Directors
mictv telugu

పరాగ్ అగర్వాల్‌కు మరో షాకిచ్చిన ఎలన్ మస్క్.. ఇక అతనొక్కడే

November 1, 2022

Elon Musk Becomes 'Temporary' CEO Of Twitter After Firing All Board Of Directors

44 బిలియన్ల డాలర్లతో ట్విటర్‌ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ తన సొంతమైన వెంటనే సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె సహా నలుగురు ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించిన ఆయన.. తాజాగా బోర్డు సభ్యులందరిపై వేటు వేశారు. ప్రస్తుతం ట్విటర్‌ బోర్డులో తానే ఏకైక డైరెక్టర్‌ అని పేర్కొన్నారు.

ఈ మేరకు సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సోమవారం సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించారు.
ట్విటర్‌ను తాను కొనుగోలు చేయడానికి ముందు డైరెక్టర్లుగా ఉన్నవారంతా ఇకపై ట్విటర్‌ బోర్డు సభ్యులుగా ఉండబోరని మస్క్‌ ఆ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. బోర్డు మెంబర్లలో మాజీ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బోర్డులో తానొక్కడినే డైరెక్టర్‌గా ఉన్నానని, అయితే ఇది తాత్కాలికమేనని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌కు తెలిపాడు. ఈ పరిణామంతోమాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ , ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఇకపై డైరెక్టర్లుగా ఉండరని , ఇది వారిక మరో ఎదురుదెబ్బ అని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.