Elon Musk bringing views count for tweets in twitter revamp mission
mictv telugu

ట్విటర్లో కొత్త ఫీచర్.. తెలిసిపోతుంది!

December 24, 2022

Elon Musk bringing views count for tweets in twitter revamp mission

దాదాపు మూడున్నర లక్షల కోట్లతో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పక్కా బిజినెస్ మైండుతో ముందుకు వెళ్తున్నాడు. మేధావులకు, రాజకీయ నాయకులకు వంటి కొంతమంది మాత్రమే ఎక్కువ వాడుతున్న ట్విటర్‌ను పక్కా మాస్ యవ్వారంగా మార్చునున్నాడు. ఇందులో భాగంగా వ్యూస్ ఆప్షన్ తీసుకురానున్నాడు. ఒక ట్వీట్‌ను ఎంతమంది చూశారో లెక్కగట్టి చెప్పే ఆప్షన్ ఇది. ప్రస్తుతం వీడియోలకు ఉన్న ఈ వ్యూస్ కౌంటును ట్విటర్ ప్లాట్‌ఫామ్ డెవపమెంట్ కోసం పట్టుకొస్తున్నట్లు మస్క్ చెప్పారు. ‘ట్విటర్‌ను మరింత లైవ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం 90 శాతం మంది ట్విటర్ యూజర్లు అందర్లాగే ట్వీట్లను చదువుతున్నారు తప్పితే ట్వీట్ చేయడం లేదు, లైక్ కొట్టడం లేదు’ అని ఆయన ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్‌కు 5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ట్విటర్‌ బాగా గబ్బుపట్టిపోయిందని, దీన్ని ప్రక్షాళన చేసి అందరికీ మరింత స్పేస్ ఇవ్వాలన్నదే తన లక్ష్యమని మస్క్ చెబుతుండడం తెలిసిందే. స్పేస్ సంగతి పక్కన బెడితే ట్విటర్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటికి పంపడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి.