నెటిజన్లకు కొత్తగా పట్టుకున్న పిచ్చి చాట్ జీపీటీ. సమాధానాలు చెబుతోంది కదాని అన్నిరకాల ప్రశ్నలూ అడిగేస్తున్నారు. సాంకేతిక ప్రపంచంలో తాజా సంచలనం చాట్ జీపీటీ చాలా మందికి నచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే ఈ టూల్ ఇంకా పూర్తిగా డెవలప్ అవలేదు.అయినా కూడా అందరినీ భలే ఆకర్షిస్తోంది. చాట్ జీపీటీతో బోలెడంత మాట్లాడేస్తున్నారు. అలా ఐజాక్ లాటెరెల్ అనే వ్యక్తి ఎలాన్ మస్క్ గురించి కూడా అడిగారు. మరి అతని గురించి ఆ టూల్ ఏం చెప్పిందో తెలుసా.
ఐజాక్ ఒక్క ఎలాన్ మస్క్ గురించే కాదు గొనాల్డ్ ట్రంప్, బోరిస్ జాన్స్న్, పుతిన్, కిమ్ కర్దాషియన్ లాంటి వ్యక్తులు గురించి అడిగారు. ఈ లిస్ట్ లో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. వీళ్ళందరి గురించి చాట్ జీపీటీ ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. వీళ్ళందరూ కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పింది. అంతే కాదు వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు అని కూడా చెప్పింది. ముఖ్యంగా మస్క్, ట్రంప్ లు ఇందుకు ఎక్కువ అర్హులని పొగిడింది. వీళ్ళనే కాదు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఉ. కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ లు కూడా ఇలాంటివారే అని చెప్పింది. కానీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం ప్రత్యేక వ్యక్తులు కాదంట.
ఐజాక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చాట్ జీపీటీ సమాధానాలకు ఎలాన్ స్పందించారు. రెండు ఆశ్చర్యార్ధకాలను కామెంటారు. అలాగగే దీని మీద ఇంకా చాలా మంది కామెంట్లు పెట్టారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారమే చాట్ జీపీటీ సమాధానాలు చెబుతోందిని నెటిజన్లు అంటున్నారు.