ఇటీవలే 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కంపెనీని కొనుక్కున్న టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మరో నిర్ణయం తీసుకున్నారు. కోకాకోలా కంపెనీని కూడా కొనుగోలు చేస్తానని గురువారం ట్విటర్లో ప్రకటించాడు. అంతేకాకుండా నిషేధిత డ్రగ్ అయిన కొకైన్‌ను కోకాకోలాకు తిరిగి చేరుస్తానన్నాడు.
కోకోకోలాలో కొకైన్ కలపడంపై మస్క్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. కోకా కోలా కూల్ డ్రింక్‌లో కోకా ఆకులు, కోలా గింజల పదార్థాలు ఉంటాయి. మానసిక ఉద్రేకాన్ని కలిగించే డ్రగ్ కొకైన్ కోెకా ఆకుల నుంచే తయారవుతుంది. ఒకప్పుడు కోకా కోలా కూల్ డ్రింక్ తయారీకి ఎక్కువగా కోకా ఆకులే ఆధారం. కొకైన్‌ను ఔషధంగా పరిగణించినప్పటికీ హానికర మత్తువల్ల దాన్ని నిషేధించారు. అమెరికాలో దానికి బదులుగా డికొకైనైజ్డ్ కోకా ఆకులు వచ్చాయి. కోకా కోలాలో తిరిగి కొకైన్ చేరుస్తానంటూ తీసుకొస్తానంటూ మస్క్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.