స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ప్రేమలో పడ్డాడు. ఆస్ట్రేలియాకు చెందిన నటి నటాషా బాసెట్‌తో డేటింగ్ చేస్తున్నాడు. సాధారణంగా తన ప్రైవేట్ లైఫ్‌ని గుట్టుగా ఉంచేందుకు ఇష్టపడే మస్క్.. అనుకోకుండా కొత్త ప్రేయసితో కెమెరాకు చిక్కాడు.
నటాషాతో కలిసి ఫ్రాన్స్‌లోని ఓ హోటల్లో విడిది చేసిన ఫోటోలు లీక్ అవడంతో వారిద్దరి మధ్య బంధం ఉన్నట్టు విదేశీ మీడియా తెలియజేసింది. కొద్ది రోజుల ముందు నటాషా ఎలాన్ మస్క్ తల్లిని కలిసిందని కూడా మీడియా వెల్లడించింది. మస్క్‌కు ఇంతకు ముందు వివాహం కాగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యతో విడిపోయి విడాకులు కూడా తీసుకున్నాడు. దాంతో సింగిల్‌గా ఉన్న మస్క్ నటి నటాషాను లైన్లో పెట్టాడు.