టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ప్రపంచ నెంబర్ 1కుబేరుడు అనే పేరును కోల్పోయారు. ఈ విషయంలో మాత్రం మస్క్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నుంచి పేరుకోల్పోయిన వ్యక్తిగా మస్క్ ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా మరింత గుర్తింపు పొందాడు. చరిత్రలోనే అత్యధికంగా వ్యక్తిగత సంపదను పోగొట్టుకున్న వ్యక్తిగా మస్క్ గుర్తింపు పొందాడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెల్లడించింది. నవంబర్ 2021లో మస్క్ సంపద 320 బిలియన్ డాలర్లు ఉండగా..జనవరి 2023లో 137 బిలియన్ డాలర్లకు తగ్గింది. దాదాపు 200బిలియన్ డాలర్ల సంపదను మస్క్ కోల్పోయాడు.
Elon Musk has broken the world record for the largest loss of personal fortune in history. https://t.co/eXSBfBuPi6
— Entrepreneur (@Entrepreneur) January 11, 2023
అయితే ఖచ్చితంగా ఎంత అనేది చెప్పడం సాధ్యం కానప్పటికీ…నవంబర్ 2021 నుంచి మస్క్ 182 బిలియన్ డాలర్లు కోల్పోయాడు. 2020లో జపనీస్ ఆధారిత టెక్ ఇన్వెస్టర్ మసయోషి సన్, 58.6 బిలియన్ డాలర్లను కోల్పోయి రికార్డులు బద్దలు కొట్టింది. టెస్లా షేర్ల వల్లే మస్క్ ఈ సంపదను కోల్పోయాడని ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు మస్క్ 7 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను విక్రయించాడు. నవంబర్ లో 4 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను తిరిగి విక్రయించినట్లు తన నివేదికలో వెల్లడించింది టెస్లా. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత అంటే అక్టోబర్ 2022 నుంచి సంపద తగ్గిందని జిఆర్ డబ్య్లూ తెలిపింది.
రెండవందల బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా మస్క్ నికర విలువ గణనీయంగా తగ్గింది. టెస్లా అమెరికాతోపాటు చైనాలో అతిపెద్ద మార్కెట్ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు సంస్థ. అయితే కోవిడ్ నియంత్రణ ఫలితంగా చైనాలో టెస్లా మార్కెట్ భారీగా పడిపోయింది. దీంతో షేర్ విలువ కూడా భారీగా తగ్గింది. అటు ట్విట్టర్ కూడా నష్టాల బాటలో ఉంది. 60శాతం కంటే సిబ్బందిని కోల్పోయాడు మస్క్.