Elon Musk lost 63 thousand crores in one day
mictv telugu

అదానీకి రూట్ క్లియర్ చేస్తున్న మస్క్.. ఒక్కరోజులో 63 వేల కోట్లు లాస్

December 21, 2022

 

Elon Musk lost 63 thousand crores in one day

ప్రపంచ ప్రస్తుత రెండో కుబేరుడు ఎలాన్ మస్క్ మంగళవారం భారీగా నష్టపోయారు. అమెరికా స్టార్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడితో టెస్లా షేర్లు పతనం కావడంతో బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. మన కరెన్సీలో రూ. 63.72 వేల కోట్లు. అక్టోబర్ తర్వాత ఇంత పతనం చెందడం ఇదే తొలిసారి. ముఖ్యంగా ట్విట్టర్ ని కొన్న తర్వాత నుంచి మస్క్ కి కలిసి రావట్లేదు. ట్విట్టర్ కోసం టెస్లా షేర్లను అమ్మి 3.58 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాడు. కానీ, అది అంత సక్సెస్ కాకపోవడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఆ ప్రభావం మంచిగా రన్ అవుతున్న టెస్లా మీద పడుతోంది. మస్క్ ఆస్తుల్లో చాలా వరకు స్టాక్స్ మరియు ఆప్షన్స్ రూపంలో ఉన్నాయి. వాటి విలువ తగ్గినప్పుడు ఆటోమేటిగ్గా సంపద కూడా తగ్గుతుంది. ప్రస్తుతం మస్క్ 148 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఉన్నారు. మన గౌతమ్ అదానీ 127 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. మస్క్ పతనం ఇలాగే కొనసాగితే అదానీ రెండో స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.