Elon Musk now lays off 4,400 contractual workers at Twitter: Report
mictv telugu

మస్క్ కీలక నిర్ణయం.. మరో 4,400 మంది తొలగింపు

November 14, 2022

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విట్టర్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత దశలవారీగా ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తున్నారు. తాజాగా ఎలాంటి నోటీసులు లేకుండా 4000 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. ఎలాన్ మస్క్ నిర్ణయంపై జాబ్ కోల్పోయిన ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దాదాపుగా 4,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమ అధికార మెయిల్, ఆన్‌లైన్ సేవల యాక్సెస్ కోల్పోయిన తర్వాత తాము లే ఆఫ్‌లకు గురైనట్లు తెలిసిందట.

మొత్తం ట్విట్టర్ లో 5,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే వారిలో 4400 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులు కంటెంట్ నియంత్రణ, సైట్ ను అప్‌డేట్, రన్నింగ్‌ లో ఉంచే కీలక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో 50 శాతం ఉద్యోగులను అంటే దాదాపుగా 3700 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మస్క్. భారతదేశంలో 90 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నిర్ణయం తీసుకున్న వారానికి తాజాగా 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు