Elon musk Plans More Layoffs Today After Sacking 50% Staff
mictv telugu

ట్విట్టర్ ఖేల్ ఖతమేనా?

November 21, 2022

ఎలాన్ మస్క్ తగ్గేదేలే అంటున్నాడు. ఉద్యోగుల రాజీనామాలపై రగిలిపోతున్నారు. మరింత మంది ఉద్యోగాల ఊస్టింగ్‌కు రెడీ అయ్యాడు. ఇప్పటికే 50శాతం ఉద్యోగుల్ని తొలగించిన మస్క్..మరింత మందిని తీసేసేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగుులూ తగ్గడం లేదు. ట్విట్టర్‌కు షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నారు. మరో 12 వందల మంది రాజీనామా చేశారు. ఉద్యోగాల్ని వీడే యోచనలో ఉన్నారు. ట్విట్టర్ ఖేల్ ఖతమేనా? ఉద్యోగుల రాజీనామాతో చాప్టర్ క్లోజ్ అయినట్టేనా?ఎలాన్ మస్క్ చేజేతులా ట్విట్టర్‌ని ముంచేస్తున్నారా?

మస్క్ రిస్క్

పిట్టపోరు కంటే మస్క్ పోరు ఎక్కువైంది. ఉద్యోగుల టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. కూల్‌గా పనిచేసే రోజులు పోయాయి. కొత్త సీఈఓ మస్క్ నిర్ణయాలు సంస్థను వీడేలా చేస్తున్నాయి. ఇప్పటికే సగం మంది ఉద్యోగులకు ఇంటికి పంపారు. మరికొంతమంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. కీలక విభాగాల్లో చాలా మంది వెళ్లిపోయారు. ఇంకొంతమంది సంస్థను వీడే యోచనలో ఉన్నారు. మరికొందరిని తీసేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నారు. సామూహిక రాజీనామాలపై ఆయన రగిలిపోతున్నారు. సేల్స్ , భాగస్వామ్య పక్షాల విభాగాల్ని టార్గెట్ చేశారు. ఇక్కడ పనిచేసేవారికి లే ఆఫ్ ఇవ్వబోతున్నారు.

ఉద్యోగులూ తగ్గేదేలే…

మస్క్ చెత్త నిర్ణయాలతో ఉద్యోగులూ ఫైర్ అవుతున్నారు. ట్విట్టర్‌లో ఉన్నా భవిష్యత్ ఉండదని ఆలోచిస్తున్నారు. వీలైనంత త్వరగా సంస్థను వీడాలనుకుంటున్నారు. అందుకే గతవారం సామూజిక రాజీనామాలకు తెరతీశారు. వందలాది మంది మస్క్ కు ఝలక్ ఇచ్చారు.వీరి నిర్ణయంతో మస్క్ ఫైర్ అవుతున్నారు. కొత్తవారిని త్వరగా అపాయింట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు మరింతమందిని ఇంటికి పంపాలని డిసైడ్ అయ్యారు.

ట్విట్టర్ ఖేల్ ఖతమేనా?
లక్షల కోట్ల డబ్బు పోసి మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేశారు. కానీ దాని ఎలా నడిపించాలో తెలియదు. కాస్ట్ కటింగ్ పేరుతో చెత్త నిర్ణయాలు తీసుకున్నారు. మంచిగా నడుస్తున్న సంస్థను డిస్టర్బ్ చేశారు. ఉద్యోగుల్ని మానసికంగా వేధిస్తున్నారు. వర్కింగ్ అవర్స్ పెంచి టెన్షన్ పెట్టించారు. పనిచేసే వాతావరణం పూర్తిగా దెబ్బతీశారు. కాస్తో కూస్తో ఉన్న ఉద్యోగులు భయం భయంతో గడుపుతున్నారు. ఇప్పుడున్న అందరి స్థానాల్లో కొత్త ఉద్యోగుల్ని తీసుకున్నా ట్విట్టర్ కోలుకోవడం కష్టం. రన్నింగ్ లో సంస్థను చేజేతులా మస్క్ నాశనం చేశారని మాజీ ఉద్యోగులు అంటున్నారు. అటు ట్విట్టర్‌కు ప్రత్యామ్యాయంగా సంస్థల ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే వాటిని అందుకోలేనంత కిందకు ట్విట్టర్ పడిపోతుంది.