మస్క్ బిగ్ షాక్.. ట్విటర్ డీల్ నిలిపివేత.. షేర్లు ఢమాల్ - MicTv.in - Telugu News
mictv telugu

మస్క్ బిగ్ షాక్.. ట్విటర్ డీల్ నిలిపివేత.. షేర్లు ఢమాల్

May 13, 2022

ట్విటర్ కొనుగోలు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. భారీ నిధులతో ఈ సోషల్ బ్లాగింగ్‌ను కొనడానికి ఒప్పందం చేసుకున్న అపర కుబేరుడు ఎలన్ మస్క్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి ‘డీల్’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. ‘స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్‌ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాం.

స్పామ్, ఫేక్ ఖాతాలు 5% కంటే తక్కువే ఉన్నాయి’ అని తెలిపారు.
మస్క్ ట్విటర్ కంపెనీని 44 బిలియన్‌ డాలర్లతో కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో కంపెనీ అతని చేతుల్లోకి వెళ్లిపోవాల్సి ఉండగా డీల్‌ను పక్కనబెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మస్క్ నిర్ణయంతో ట్విటర్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రీమార్కెట్ ట్రేడింగులో షేర్ విలువ 37 డాలర్ల నుంచి 17.7 డాలర్లకు పడిపోయింది.