వచ్చే ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌ పార్టీకే నా ఓటు.. ఎలాన్ మస్క్ - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చే ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌ పార్టీకే నా ఓటు.. ఎలాన్ మస్క్

May 19, 2022

గత కొన్ని రోజులుగా అమెరికా రాజకీయాలపై మాట్లాడుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తాజాగా వచ్చే ఎన్నికల్లో ట్రంప్ కే ఓటేస్తానని అన్నారు. గత ఎన్నికల్లో తాను డెమొక్రటిక్ పార్టీ(జో బైడెన్‌ పార్టీ)కి ఓటేశానని.. ఇప్పుడు ఎంత మాత్రం వారికి మద్దతు ఇవ్వబోనని, ఇక తాను రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. బుధవారం ట్విట్టర్ ద్వారా మస్క్ ఈ విషయాన్ని తెలిపారు.

డెమొక్రాట్‌లు అంటే సౌమ్యంగా ఉండేవారని.. కానీ ప్రస్తుతం విభజన, ద్వేషం పెంచే పార్టీగా తయారవుతోందని అన్నారు. అందుకే ఇక నుంచి వారికి మద్దతు ఇవ్వనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్‌ (డోనాల్డ్ ట్రంప్) పార్టీకే ఓటు వేస్తానని చెప్పారు. ఈ బహిరంగ ప్రకటన తర్వాత.. వారంతా ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఎలా చెడు ప్రచారం చేస్తారో చూడండి’ అంటూ జో బైడెన్‌ పార్టీని ఉద్దేశిస్తూ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. రానున్న మరికొన్ని నెలల్లో తనపై రాజకీయ దాడులు మరింత పెరగుతాయని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.