ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ మామ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఊహకందని చర్యలతో అటు ఉద్యోగులను, ఇటు యూజర్లను తికమకపెట్టేస్తున్నాడు. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు దక్కించుకున్న తర్వాత సమూల మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఆ కంపెనీలో అప్పటివరకు పనిచేస్తున్న సీనియర్లను ఇంటికి పంపించేశాడు.రెస్ట్ లేకుండా పనిచేయాలని ఉన్న ఉద్యోగులను ఆదేశించారు. అంతే కాకుండా యూజర్లను కూడా మస్క్ వదల్లేదు. బ్లూటిక్ సర్వీసుల కోసం డబ్బులు చెల్లించాలని ప్రకటించి షాక్ ఇచ్చాడు.
తాజాగా ఖర్చుల తగ్గించుకునే పనిలో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు ఎలాన్ మస్క్. బారత్‌లో ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. ఢిల్లీ, ముంబాయి కార్యాలయాల సిబ్బంది ఇంటినుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బెంగళూరు కార్యాలయంలో మాత్రమే విధులు సిబ్బంది పనిచేయాలని సూచించారు. గత సంవత్సరం నవంబర్‌లో భారత్‌లో ఉండే సిబ్బందిలో 90 శాతం మందిని మస్క్ తొలగించాడు.