ఎలన్ మస్క్ కొడుకు పేరు X Æ A-12.. అర్థం ఏటంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఎలన్ మస్క్ కొడుకు పేరు X Æ A-12.. అర్థం ఏటంటే

May 6, 2020

Elon Musk Son Name.jp

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎలక్ట్రిక్ కార్లతో సంచలనం సృష్టించిన టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్‌కు కొడుకు పుట్టాడు. అతని ప్రియురాలు గ్రిమ్స్‌కు పుట్టిన ఆ బిడ్డతో కలిసి దిగిన ఫొటోను ఆయన షేర్ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు  ఆ బిడ్డకు ఏం పేరు పెట్టారంటూ ఆసక్తిగా అడిగారు. కానీ దీనికి ఆయన  ‘X Æ A-12’ మస్క్‌ అంటూ రిప్లే ఇచ్చారు. ఆయన చెప్పిన పేరు ఏంటో అర్థం కాకపోవడతో నెటిజన్లు తలపట్టుకున్నారు. దీనిపై రకరకాల అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్త పరుస్తున్నారు. అతడు చెప్పిన ఆ పేరు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

ఎలన్ మస్క్ చెప్పిన ఆ పేరు గ్రిమ్స్ స్పందించారు. దాని అర్థం ఏంటో చివరకు వెళ్లడించారు. ‘X Æ A-12’ లో  X అంటే అన్‌నోన్‌ వేరియబుల్‌,  Æ A అంటే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, A-12 అంటే తమ ఫేవరెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌( ఎస్‌ఆర్‌-12) అంటూ చెప్పుకొచ్చారు. అయినా కూడా ఈ పేరు పలకడం అంత సులువుగా లేకపోడంతో ఎలా పలకాలంటూ తికమకపడుతున్నారు. మొత్తానికి తన కార్లతో సంచలనం సృష్టించిన ఆయన కొడుకు పేరును కూడా వింతగా పెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. 17వేలకు పైగా రీట్వీట్‌లు, 86వేలకు పైగా లైకులు రావడం విశేషం. కాగా గ్రిమ్స్ 2018 నుంచి ఎలన్ మస్క్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.