పురుషాంగాన్ని చూపించిన ఎలాన్ మస్క్.. ఉద్యోగిని ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

పురుషాంగాన్ని చూపించిన ఎలాన్ మస్క్.. ఉద్యోగిని ఆరోపణ

May 21, 2022

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చిక్కుల్లో పడ్డాడు. అతడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తన పురుషాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ మహిళా పైలెట్ ఒకరు ఆరోపించారు. బిజినెస్ ఇన్ సైడర్ పత్రిక కథనం ప్రకారం..ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా స్పేస్ ఎక్స్ కంపెనీ ఆమెకు దాదాపు రెండు కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2016లో మస్క్, సదరు మహిళా పైలెట్ ప్రైవేటు విమానంలో వెళ్లినప్పుడు మసాజ్ చేయించుకున్న తర్వాత మస్క్ తన పురుషాంగాన్ని ఆమెకు చూపించాడట. అంతే కాకుడా ఆమె కాలిని తాకుతూ, తన కోరిక తీరిస్తే ఖరీదైన బహుమతి ఇస్తానని చెప్పాడట.

ఈ ఆరోపణలను మస్క్ కొట్టిపడేశారు. ఆమె ఓ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలని, రాజకీయ దురుద్దేశాలతో తనపై బురద జల్లుతోందని మండిపడ్డారు. రూ. 3.4 లక్షల కోట్లతో తను ట్విటర్ ను కొనుగోలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభావితం చేయడానికి అబద్ధాలు చెబుతోందన్నారు. ఈ ఆరోపణల ఫలితంగా మస్క్ సారథ్యంలోని టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి.