elon musk tweet on russia
mictv telugu

నేను అనుమానాస్పదంగా చనిపోతే కారణం వీళ్లే : ఎలాన్ మస్క్

May 9, 2022

ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోమవారం సంచలన ట్వీట్ చేశారు. ‘ఒకవేళ నేను అనుమానాస్పదంగా చనిపోతే..’ అంటూ రష్యన్ అధికారి తనకు పంపిన మెసేజ్‌ను పోస్ట్ చేశారు. అంటే మస్క్‌ను రష్యా చంపే అవకాశాలున్నాయని పరోక్షంగా తెలియజేస్తున్నాడు. రష్యన్ అధికారి పంపిన మెసేజ్ ఇలా ఉంది.

‘ఉక్రెయిన్‌లో ఫాసిస్ట్ బలగాలతో పాటు సమాచార పరికరాలను పంపడంలో మీరు భాగస్వాములని మాకు తెలుసు. మీరు చేసిన పనికి భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని రాసి ఉంది. దీంతో ఆయన అభిమానులు, నెటిజన్లు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు నెటిజన్లు ‘కొత్త సంస్కరణలు తీసుకురావడానికి మీరు బతికే ఉండాల’ని ట్వీట్ చేస్తున్నారు.