ట్విట్టర్ లో బ్లూ టెక్ సబ్ స్క్రైబర్లుగా ఉన్నారా? అయితే మీకు ఇది శుభవార్త. మీ పేజీల నుంచి వచ్చే ప్రకటనల ఆదాయంలో మీకు కూడా వాటా రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు.
ట్విట్టర్ లో సెలెబ్రిటీలే కాదు.. మరికొంతమంది కూడా బ్లూ టిక్ ని కలిగి ఉన్నారు. వారికి అదనపు ఆదాయ మార్గం దొరికింది. అవును మీరు వింటున్నది నిజమే. మరింత మంది యూజర్లను ఆకర్షించడంలో భాగంగా దీన్ని ఎంచుకున్నది. ఆదాయంలో వాటా ఇవ్వడం వల్ల మరింత మంది యూజర్లు వచ్చే అవకాశం ఉంది.
‘నేటి నుంచి ట్విట్టర్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రియేటర్లకు, వారి రిప్లయ్ థ్రెడ్స్ లో ప్రదర్శితమయ్యే ప్రకటన రూపంలో పంచనున్నాం. దీనికి అర్హత పొందాలంటే సంబంధిత ట్విట్టర్ యూజర్ తప్పనిసరిగా బ్లూ టిక్ వెరిఫైడ్ అయి ఉండాలి’ అని మస్క్ ట్వీట్ చేశారు.
ట్విట్టర్ బ్లూటిక్ అనేది చెల్లింపుల సేవ. ఈ పెయిడ్ చందాదారులకు 60 నిమిషాల దీర్ఘ నిడివి వీడియోలు అప్ లోడ్ చేసుకోవడంతో పాటు, అధిక రెజల్యూషన్ ఫోటోలు, 2జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ ను కూడా అప్ లోడ్ చేసుకునేందుకు అనుమతి లభిస్తుందన్నమాట. ట్విట్టర్ క్రియేటర్లకు అదనపు ఆదాయాన్ని అందించడమే లక్ష్యంగా మస్క్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ ఈ నిర్ణయం పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం ట్విట్టర్ క్రియేటర్లకే కాకుండా ఇతర ప్లాట్ ఫ్లామ్స్ కు సైతం లాభిస్తుంది. ఆదాయం పంచడం వల్ల చాలామంది ట్విటర్ ప్లాట్ ఫామ్ కు ఆకర్షితులవుతారు. మరికొంతమంది ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేస్తారని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
డైమండ్ నెక్లెస్ చోరీ చేసిన ఎలుక!
మూడోసారి గ్రామీ అవార్డు గెలుచుకున్న రికీ కేజ్..!!