ట్విట్టర్‌ను కొనుక్కున్న ఎలాన్ మస్క్.. ప్రశంసలు, ప్రశ్నలు - MicTv.in - Telugu News
mictv telugu

ట్విట్టర్‌ను కొనుక్కున్న ఎలాన్ మస్క్.. ప్రశంసలు, ప్రశ్నలు

April 26, 2022

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తను చెప్పినట్టే ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడు. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున మొత్తం షేర్లను 46.50 బిలియన్ డాలర్లు పెట్టి తన వశం చేసుకున్నాడు. రెండు వారాల క్రితమే సంస్థలోని 9.2 శాతం షేర్లను కొన్న ఎలాన్.. అప్పుడే ట్విట్టర్‌ను కొంటానంటూ ఆఫర్ ఇచ్చాడు. అనంతరం కొన్ని నాటకీయ పరిణామాలు జరుగగా, ఎట్టకేలకు ఎలాన్ మస్క్ పంతం నెగ్గింది.

డీల్ కుదిరిన వెంటనే ట్విట్టర్ షేరు విలువ మూడు శాతం పెరిగింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ను వాక్ స్వాతంత్య్రానికి మరింత మెరుగైన వేదికగా మారుస్తానని ప్రకటించాడు. కొనుగోలు విషయం తెలియగానే నెటిజన్లు మస్క్‌ను ఉద్దేశించి ప్రశంసలతో పాటు పలు ప్రశ్నలు సంధింస్తున్నారు. అంతరిక్షం నుంచి ట్వీట్ చేయడానికి అనుమతిస్తారా? అని ఒకరు, నిషేధించిన ఖాతాల్లో మొదట దేనిని పునరుద్ధరిస్తారు? అని ఇంకొకరు, ట్విట్టర్‌ను విద్వేష ప్రసంగాలకు వేదికగా మార్చవద్దని మరొకరు సూచించారు. అంతేకాక, ట్విట్టర్ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం డబ్బు శ్రీలంక అప్పులతో సమానమని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.