బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైనవి కొంటూ తరుచుగా వార్తల్లో ఉంటాడు. ఇప్పుడు 640 కోట్లు పెట్టి ప్రైవేట్ జెట్ కొన్నాడు. అలా అని ఇదేమీ మొదటిది కాదు. కానీ ఈ జెట్ ఇంటిరీయర్స్ మాత్రం అదరహో అనే లెవల్ లోనే ఉన్నాయి.
ట్విట్టర్ ని 44 బిలయన్ల డాలర్లకు (3.6లక్షల కోట్లు) కొనుగోలు చేసి ఎలన్ మాస్క్ వార్తల్లో నిలిచాడు. వందల కోట్ల విలువైన ఉబర్ విలాసవంతమైన ప్రైవేట్ జెట్ ను కూడా కొనుగోలు చేశాడు. బ్లూమ్ బెర్గ్ ప్రకారం.. ఎలోన్ మస్క్ ఒక టెక్నాలజీ కంపెనీ అయిన ట్విట్టర్ ను కొనుగోలు చేయడం చరిత్రలోనే నిలిచిపోతుందని అన్నారు.
G700 గురించి..
ఎలన్ మస్క్ ఇది మొదటి ప్రైవేట్ జెట్ కాదు. కొత్త ట్విట్టర్ సీఈవో నాలుగు ప్రైవేట్ గల్ఫ్ స్ట్రీమ్ జెట్స్ ను కలిగి ఉన్నాడు. ఇది ఐదవది. దీని పేరు గల్ఫ్ స్ట్రీమ్ G700. ఇందులో ఐదు లివింగ్ ఏరియాలు, రెండు రెస్ట్ రూమ్స్, 20 ఓవల్ విండోస్ ఉన్నాయి. రెండు రోల్స్ రాయిస్ ఇంజిన్ లతో 7,500 నాటికల్ మైళ్ల పరిధిని కలిగి ఉంది. సురక్షితమైన ల్యాండింగ్ కోసం డ్యూయల్ హెడ్ అప్ డిస్ ప్లే, వై-ఫై సిస్టమ్ కలిగి ఉంది. 19మంది వరకు ఇందులో ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. 51,000 అడుగుల ఎత్తులో ఎగిరే ఈ విమానం ధర 78 మిలియన్ డాలర్లు (సుమారు రూ.640కోట్లు). మరి ఆ విమానం ఫోటోలపై ఓ లుక్కేయండి.