ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన కన్నకొడుకు గ్జావియర్ అలెగ్జాండర్ మస్క్.. కోర్టుకెక్కాడు. తండ్రి పేరుతో సంబంధం లేకుండా, ఆయన నీడలో బతకడం ఇష్టం లేక కోర్టును ఆశ్రయించాడు. అన్ని వేల కోట్ల సంపద ఉన్నా తండ్రిని కాదనకోవడానికి పెద్ద కారణమే ఉంది అతడికి. ఎందుకంటే ప్రస్తుతం అతడు.. అతడు కాదు.. ఆమె. పేరు అలెగ్జాండర్ మస్క్ అలియాస్ వివియన్ జెన్నా విల్సన్.
2000 సంవత్సరంలో ఎలన్ మస్క్.. కెనడా నటి జస్టిన్ విల్సన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరుగురు సంతానం. మొదట ఐవీఎఫ్ ద్వారా జస్టిన్ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది జస్టిన్ విల్సన్. వీరిలో ఒకరు అలెగ్జాండర్ మస్క్. ఆ తర్వాత 2008లో ఎలాన్ మస్క్.. తన భార్యాకు విడాకులు ఇచ్చాడు. విడాకుల అనంతరం తల్లిదండ్రులిద్దరూ వారి పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. కవలల్లో ఒకరైన అలెగ్జాండర్ మస్క్ ప్రస్తుతం పేరు మార్పునకు దరఖాస్తు చేసుకున్నారు. అమ్మాయిగా మారిన అలెగ్జాండర్ తన పేరును వివియన్ జెన్నా విల్సన్‌గా తెలిపారు. ఏప్రిల్‌తో తనకు 18 ఏళ్లు నిండడంతో ఎలన్ మస్క్‌తో తనకు సంబంధాలు వద్దంటూ కోర్టును ఆశ్రయించారు. తన తండ్రి గుర్తింపు తనకు అవసరం లేదని.. పేరు మార్పిడికి అనుమతిచ్చి.. తన లింగ మార్పిడికి చట్టబద్ధత కల్పించాలంటూ లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
కాగా, ట్రాన్స్‌జెండర్ హక్కుల విషయంలో రిపబ్లికన్ పార్టీకి ఎలాన్ మస్క్ మే నెలలో మద్దతు ప్రకటించారు. కొత్త చట్టం ప్రకారం అమెరికాలో ట్రాన్స్‌జెండర్ హక్కులపై పరిమితులు విధిస్తారు. ఈ కారణంతోనే తండ్రి వైఖరిపై అసంతృప్తితో జేవియర్ అలియాస్ వివియన్ ఇలా పిటిషన్ వేసి ఉంటుందని భావిస్తున్నారు.