మన మెట్రో.. ఆరంభానికి ముందే అవార్డు - MicTv.in - Telugu News
mictv telugu

మన మెట్రో.. ఆరంభానికి ముందే అవార్డు

November 1, 2017

హైదరాబాద్ మైట్రో రైలు ఆరుదైన అవార్డును అందుకుంది. ప్రారంభించడానికి  ముందే  ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది.

2017 ఏడాదిగాను ‘రాబోయే అత్యుత్తమ ప్రాజెక్ట్‌’గా ఎంపికైంది. ‘కన్ స్ట్రక్షన్ వీక్ ఇండియా’ ప్రతిక  ప్రతి సంవత్సరం అత్యుత్తమ నిర్మాణం, మౌలికరంగం ప్రాజెక్ట్‌లను గుర్తించి ఈ అవార్డును ఇస్తోంది.  గత ఏడేళ్లలో  ఎల్‌అండ్‌టీ సంస్థ  హైదరాబాద్ మైట్రో రైలుకుగాను ఈ అవార్డును దక్కించకోవడం నాలుగోసారి. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ‘బెస్ట్ అప్ కమింగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్నట్లు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంపీ నాయుడు తెలిపారు.  దేశంలో చాలా మెట్రోలు వస్తున్నా,  హైదరాబాద్ మెట్రో ఆకృతి, రూపకల్పన ,అమలు అన్ని గొప్పగా ఉందని పేర్కొన్నారు.