' సున్నా' బ్రహ్మగుప్తుని కంటే  500 ఏళ్ల వెనక్కి…! - MicTv.in - Telugu News
mictv telugu

‘ సున్నా’ బ్రహ్మగుప్తుని కంటే  500 ఏళ్ల వెనక్కి…!

September 15, 2017

అంకెలు లో సున్నా(0) లేకపోతే వాటికి విలువ ఉండదు. అంకెలు ముందుగాని , వెనుక గాని  సున్నా(0) ను చేర్చడం ద్వారా దాని విలువ మారిపొతుంది. అంతంటి విలువైనా సున్నా అనే అంకెను మన భారతీయులే కనిపెట్టారన్నది, మనకు గర్వకారణమైన విషయం. ప్రాచీన మయన్స్, బాబిలోనియన్స్ లాంటి సాంప్రదాయల నుంచి కాకుండా క్రీస్తు శకం 628 లో భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మ గుప్తుడు కనిపెట్టిన సున్నాకే విలువ ఇచ్చి,సున్నా చెలామణిలోకి వచ్చింది.

సున్నా మరో 500 ఏళ్ల ప్రాచీన కాలంనాటిదని ఆధారాలతో నిరూపించారు. ఆక్సఫర్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు .ప్రాచీన తక్షశిల( ప్రస్తుతం పెషావర్ సమీపంలో ఉంది)1881 లో పెషావర్ నుంచి సేకరించిన బఖ్షలి మనులిపి 1902 నుంచి ఆక్సఫర్డ్ యూనివర్సీటీలో ఉంచారు. ఇప్పుడు కార్బన్ డేటింగ్ ఆధ్యాయనం ద్వారా ఆ లిపిపై అక్షరాల క్రమం కనుగొన్న శాస్త్రవేత్తలు,అందులో 0 కు సంబందించిన ఆధారాలను కనుగొన్నారు. సున్నాను 9 శతాబ్దానికి చెందిన మనుస్మృతి లిపి ద్వారా వెలుగులోకి వచ్చింది. బ్రహ్మగుప్తుడు రచించిన బ్రాహ్మన్పుటసిద్దాతం  నుంచి సున్నాను స్వీకరించారు. అయితే బఖ్షలి లిపి మాత్రం 224 నుంచి 383 క్రీశ  కాలానికి చెందినదిగా చెబుతున్నారు. ఆ లెక్కన  ఇంతకు ముందు దాని కంటే సున్నా 500 ఏళ్ల క్రితమే  ఉందని  మర్కస్ డు సౌతోయి  అనే గణిత పరిశోధకుడు చెబుతున్నాడు. బఖ్షలి లిపి చుక్క రూపంలో ఉంది ఇది కాలాక్రమేణా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.