Eluru DIG Palaraj said the recent incident in Amalapuram was planned
mictv telugu

పక్కా ప్లాన్ ప్రకారమే అమలాపురం అల్లర్ల ఘటన.. డీఐజీ

May 27, 2022

Eluru DIG Palaraj said the recent incident in Amalapuram was planned

కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఇటీవల జరిగిన ఘటన పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని ఏలూరు డీఐజీ పాలరాజ్‌ వెల్లడించారు. ఘటనపై ముందస్తుగానే వాట్సాప్‌లో చర్చించుకున్నారని ఆయన వివరించారు. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏమేం చేయాలో చర్చించుకున్నారని తెలిపారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లను కూడా అరెస్ట్ చేస్తున్నామని పాలరాజు చెప్పారు. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని.. సాయంత్రానికి మరిన్ని అరెస్ట్‌లు వుంటాయని వెల్లడించారు.
అమ‌లాపురం అల్ల‌ర్ల‌కు రౌడీ షీట‌ర్లే కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అల్ల‌ర్ల‌లో పాలుపంచుకున్న మ‌రికొంద‌రిని గుర్తించామ‌ని, శుక్ర‌వారం మ‌రికొంద‌రిని అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనుమానితుల అరెస్టులు పూర్త‌య్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవ‌ల నిలుపుద‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని డీఐజీ వెల్లడించారు. అరెస్టులు ముగిశాక ద‌శ‌ల‌వారీగా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని పాల‌రాజు స్పష్టం చేశారు.