Embridery comes in water from dissolve fabric
mictv telugu

ఈ ఆర్టిస్ట్ సరికొత్త ఎంబ్రాయిడరీని సృష్టిస్తున్నది!

November 19, 2022

చీరల మీద, బ్లౌజ్ల మీద ఎంబ్రాయిడరీలు వేయించుకోవడం మామూలే! జీన్స్ల మీద కూడా అక్కడక్కడ ఈ అల్లికలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ ఎంబ్రాయిడరీలను సరికొత్తగా మలుస్తున్నదో ఆర్టిస్ట్.

ఎంబ్రాయిడరీ ఇప్పుడ కొత్త పుంతలు తొక్కుతున్నది. కేవలం కావాల్సిన చోట ఎంబ్రాయిడరీ చేయడం కాదు.. ఒక ఫ్యాబ్రిక్ మీద చేసి దాన్ని మీరనుకున్న చోట అతికించేలా ఈ ఫ్యాబ్రిక్ని తయారు చేస్తున్నారు. పైగా ఈ ఎంబ్రాయిడరీకి సహజమైన ప్రకృతి ప్రేరణగా నిలుస్తున్నది. ఒక సరికొత్త ఎంబ్రాయిడరీని సృష్టించి దాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నదో

ఆర్టిస్ట్.

మెరీడిత్ వూలాంగ్ ఆస్ట్రేలియాకి చెందిన విజువల్ ఆర్టిస్ట్. ఈమె పల్చని 3డీ ఎంబ్రాయిడరీ ఆర్ట్ వర్క్ ఎలా చేయాలో సరికొత్తగా చూపిస్తున్నది. పాలీవినైల్ ఆల్కాహాల్ ఫ్యాబ్రిక్ మీద ఈ ఎంబ్రాయిడరీ చేస్తుంది. ఈ బయోడీగ్రేడబుల్ ఫ్యాబ్రిక్ మీద ఏం చేసినా బయటకు వచ్చేస్తుంది. కొత్తగా ఉంది కదా! ఈ కొత్తదనం కోసమే మెరీడిత్ ఎంతో తాపత్రయపడింది. తన కళ ఈ ప్రపంచానికి కొత్తగా కనిపించాలనుకుంది. అందుకే ఈ విజువల్ ఆర్టిస్ట్ ముందుగా తన ఈ కళకు నీటిలో కరిగే ఫ్యాబ్రిక్ తయారు చేసింది. అది కూడా సహజమైన ఫ్యాబ్రిక్ ఉంటే బాగుంటుందనుకుంది. దానికి వాటర్ సోలబుల్ ఫ్యాబ్రిక్ని తయారు చేసింది.

మనకు కావాల్సిన ఫార్మాట్లో ఈ ఎంబ్రాయిడరీని చేస్తుంది. ‘మనకు ప్రకృతి ఎంతో ఇచ్చింది. దాన్ని మనం సరిగా గుర్తించి వాడుకోవాలి. నా చుట్టూ ఉన్నప్రపంచం నాకు ప్రేరణ. ఈ ఫ్యాబ్రిక్ మెడికల్ ఇండస్ట్రీలో వాడుతారు. ఇందులో సర్జరీ గౌన్లు వేసి ఉతుకడానికి ఈ ఫ్యాబ్రిక్లలో నింపుతారు’ అంటున్నది వూలాంగ్. ముందుగా ఈ ఫ్యాబ్రిక్ మీద అనుకున్న డిజైన్ని మెషీన్ మీద పెట్ట కుట్టాలి. దానికంటే ముందు మెరీడిత్ డిజైన్ని పెన్, పెన్సిల్తో అవుట్లైన్ గీస్తుంది. ఆ తర్వాత ఎంబ్రాయిడరీ చేస్తుంది. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటిలో ఈ ఫ్యాబ్రిక్ వేస్తే కరిగిపోతుందట. కేవలం ఎంబ్రాయిడరీ మాత్రం మిగులుతుంది. ఈ ఎంబ్రాయిడరీని ఒకరోజంతా ఆరబెట్టి ఆ తర్వాత మనకు కావాల్సిన చోట అతికించడానికి వీలుగా మారుతుంది. ఈ ఆర్ట్ని ఫ్రేముల్లో బంధించి ఒక షో కూడా చేసింది మెరీడిత్. ఈమె ఒక బ్లాగ్ కూడా రన్ చేస్తున్నది. ఇందులో ఈ ఆర్ట్కి సంబంధించిన వివరాలు.. ఈ కళను ఎలా చేయాలో కూడా టిప్స్, ట్రిక్స్ కూడా చెబుతున్నది.