నాగాభరణం, గరుత్మంతుడితో కూడిన రూ.25 కోట్ల శివలింగం స్వాధీనం - MicTv.in - Telugu News
mictv telugu

నాగాభరణం, గరుత్మంతుడితో కూడిన రూ.25 కోట్ల శివలింగం స్వాధీనం

May 18, 2022

ప్రపంచంలోని మరే దేశంలో లేని అరుదైన ప్రాచీన సంపద భారతదేశానికే సొంతం. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు అపూర్వ కట్టడాలకు, విలువైన విగ్రహాలకు నెలవు. అలాంటి అరుదైన , సుమారు రూ. 25 కోట్ల విలువైన శివలింగాన్ని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. చెన్నైలోని పూందమల్లిలో ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పట్టుకున్నారు. నాగాభరణంతో ఉన్న ఆ శివలింగం సుమారు పది కేజీల బరువున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ శివలింగాన్ని అమ్మకానికి పెట్టిన నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా (46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు చెందిన భాగ్యరాజ్‌ (42)గా గుర్తించారు. శివలింగం మీద మీద పాము పడగ, పాము పడగ వెనుక భాగంపై గరుత్మంతుడి బొమ్మతో అద్భుతంగా ఉన్న ఈ మరకతపచ్చ శివలింగం చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ శివలింగం సుమారు ఐదువందల సంవత్సరాలనాటిదని పోలీసులు భావిస్తున్నారు.