Emergency approval for nasal vaccine in india
mictv telugu

కరోనాపై మరో విజయం.. నాసల్ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి

September 6, 2022

కోవిడ్‌పై భారత్ కొనసాగిస్తున్న పోరులో మరో టీకా చేరింది. భారత్ బయోటెక్ రూపిందించిన నాసల్ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి లభించింది. ఈ మేరకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ముక్కు ద్వారా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ టీకాను ఇప్పటికే 4 వేల మంది వాలంటీర్లపై ప్రయోగించగా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని సంస్థ తెలిపింది. పూర్తి సురక్షితమైనదనీ, వ్యాధి నిరోధక శక్తిని సమర్ధంగా ప్రేరేపిస్తోందని గత నెలలో కంపెనీ వివరించింది. తర్వాత కొన్ని మార్పులు చేసి చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ సాయంతో ఈ టీకాను అభివద్ధి చేశామని ప్రకటించింది. వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో విజయవంతంగా టీకాను రూపొందించినట్టు వివరించింది. కాగా, దేశంలో అనుమతి పొందిన తొలి నాసల్ వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం.