Emergency first look has arrived..Tell that president..
mictv telugu

ఆకట్టుకుంటున్న ఎమర్జెన్సీ ఫస్ట్ లుక్..

July 14, 2022

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ దర్శకురాలిగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని నిర్మాణ సంస్థ విడుదల చేసింది.

 

విడుదలైన మోషన్ పోస్టర్‌లో.. కంగనా రనౌత్ అచ్చుగుద్దినట్లు ఇందిరాలా కనిపించింది. అంతేకాదు, ఇందిరా గాంధీలా హావభావాలు పలికించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. “అమెరికా ప్రెసిడెంట్‌కు చెప్పండి. నా కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ నన్ను సర్ అనే పిలుస్తారు. మేడమ్ అని కాదు” అంటూ కంగనా చెప్పిన డైలాగ్లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ యాక్టింగ్, డ్రైలాగ్స్‌తో కూడిన ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేయడంతో ప్రేక్షకులు నుంచి స్పందన లభిస్తుంది.