దుబాయ్ నుంచి న్యూజిలాండ్ వెళ్లేందుకు ఎమిరేట్స్ విమానం ఎక్కిన ప్రయాణికులకు చుక్కలు కనబడ్డాయి. ఏకంగా 13 గంటల పాటు ప్రయాణం చేసి మళ్లీ ఎక్కిన చోటకే తిరిగి వచ్చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో వైరల్‌గా మారింది.
ఈ మధ్య విమానప్రయాణాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. విమానంలో బడాబాబుల చేస్తున్న విచిత్ర ప్రవర్తనలు అందుకు కారణం. తోటి ప్రయాణికులపై ఒకరు మూత్రం పోస్తే..మరొకరు విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ను ఓపెన్ చేస్తున్నారు. ఆ మధ్య ఓ ఇద్దరు వ్యక్తులైతే ఏకంగా ప్రయాణిస్తున్న విమానంలో గొడవ పడడం చూశాం. ఇలా ఏదో ఒక కారణంతో ఫ్లైట్స్ న్యూస్‌లు నూసెన్స్ అవుతున్నాయి. ఇంకా సెలబ్రిటీలకు చేదు అనుభవాలు, విమానంలో లగేజ్ మిస్సింగ్ వంటివి కూడా ఈ మధ్య చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు తాజా మరో విమానం న్యూస్ మన ముందుకొచ్చింది. అలాంటి తరహా ఘటన కాకపోయినా..కొంచెం ఆసక్తి రేపిన వార్తనే..
దుబాయ్ నుంచి న్యూజిలాండ్ ఓ విమానం బయలుదేరింది. సుమారు 13 గంటలు ప్రయాణం సాగించింది. ఇంకా కొంత సమయంలో అంతా దిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో మళ్లీ ఆ విమానంను వెనక్కు తిప్పేశారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. టేకాఫ్ అయిన చోటకే మళ్లీ ల్యాండింగ్ చేస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
భారీ వరదల కారణంగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విమానశ్రయం నీటితో నిండిపోవడంతో అంతర్జాతీయ విమానాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సగం దూరం ప్రయాణించిన ఎమిరేట్స్ విమానం గమనాన్ని వెనక్కు మార్చారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురికావాల్సి వచ్చింది.