రేప్ బాధితులకు 9 కోట్లు ఇచ్చిన హాలీవుడ్ నటి - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ బాధితులకు 9 కోట్లు ఇచ్చిన హాలీవుడ్ నటి

February 20, 2018

అత్యాచార బాధితులు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. తప్పు తమది కాకపోయిన సంఘంలో పేరుకుపోయిన అపోహలు, దురాచారాల వల్ల వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి. విచక్షణ, హృదయం లేని జనం వాళ్లను ఏవగించుకుంటారు. ఈ నేపథ్యంలో వారికి ఆదుకోవడానికి హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సాన్ ముందుకొచ్చారు. రేప్ బాధితుల కోసం ఆమె రూ. 9 కోట్ల భూరి విరాళం ప్రకటించారు.లైంగిక బాధితులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘యూకే జస్టిస్‌ అండ్‌ ఈక్వాలిటీ ఫండ్‌’కు ఎమ్మా మిలియన్‌ విరాళమిచ్చారు. ఫండ్‌కు అందిన తొలి విరాళం కూడా ఆమెదే.  పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు స్వస్తి పలకాలంటూ  బ్రిటన్,  ఐర్లాండ్ నటీమణులు, సెలబ్రిటీలు ఉద్యమం ప్రారంభించారు. ఈ-క్యాంపెయిన్‌ ద్వారా వెబ్ సైట్లు, సోషల్ మీడియా, యూట్యూబ్ తదితరాల్లో ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాసిన బహిరంగ లేఖలో ఎమ్మా థాంప్సన్‌ కూడా సంతకం చేసింది. ‘హ్యారీ పోటర్‌’ సిరీస్‌, ‘ది బ్లింగ్‌ రింగ్‌’, ‘దిస్‌ ఈజ్‌ ద ఎండ్‌’, ‘కొలోనియా’, ‘బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌’ తదితర చిత్రాల్లో ఎమ్మా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.