ఎమోజీ కాదు.. జోమోజీ అంట! - MicTv.in - Telugu News
mictv telugu

ఎమోజీ కాదు.. జోమోజీ అంట!

December 7, 2017

కోపం, నవ్వు, హేళన వంటి రకరకాల భావోద్వేగాలను చూపే ఎమోజీల గురించి మనకు తెలుసు. సోషల్ మీడియా జనానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేలే. వేళ్లకు అంటుకునే ఉంటాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి వాటిలో సందడి చేస్తుంటాయి.

అయితే జోమోజీల గురించి మీకు తెలుసా? అయితే చదవండి.. ఇవి ఎమోజీలాగా పసుపు రంగులో ఉండవు. ఫొటోల మాదిరే ఉంటాయి. బాలీవుడ్‌ రొమాన్స్ నటుడు జాన్‌ అబ్రహం బొమ్మలు ఇలా సందడి చేస్తున్నాయి. ఆయనవి మాత్రమే ఎందుకంటే.. సొంత ఫొటోలతో జోమోజీలున్న తొలి భారతీయ నటుడు ఆయనే కాబట్టి. ఇక ఆడవాళ్ల విషయానికి వస్తే సన్నీ లియి, సోనమ్‌ కపూర్‌ జోమోజీలు ఉన్నాయి. వీటిని  న్యూ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.