చేతికర్రపై మైక్ టీవీ నుంచి గుండెను తాకే పాట... - MicTv.in - Telugu News
mictv telugu

చేతికర్రపై మైక్ టీవీ నుంచి గుండెను తాకే పాట…

June 6, 2022

చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు కింద పడిపోకుండా తల్లిదండ్రులు చేయి ఆసరా ఇస్తారు. పెద్దయ్యాక ఆ అవసరం ఉండదు. వయసు మళ్లి, కీళ్లు సడలకా చేయి ఆసరా అవసరమవుతుంది. ఎప్పుడూ ఓ మనిషి తోడుగా నిలవడం అసాధ్యం. అందుకే చేతికర్రను ఆశ్రయిస్తారు అవ్వాతాతలు. చూడ్డానికి వట్టి కర్రేగా అనుకుంటాం. కానీ అది పెద్దల ప్రాణములున్న మూడో కాలు. ఎవరి ఆసరా లేకున్నా నేనున్నాంటూ భరోసా ఇచ్చే చేతికర్రపై మైక్ టీవీ అద్భుతమైన పాటను రూపొందించింది. ఈ పాటను స్వయంగా చేతికర్ర పట్టుకరుని పల్లెటూరి వృద్ధుడు పాడటం మరో విశేషం.

‘చేతికర్రా నీ రుణమెట్లా తీర్చుకోనమ్మా అమ్మా
చిన్ననాడు అమ్మా నన్నుసేయిబట్టి నడిపినట్టు
కష్టసుఖములు కళ్లా చూసి నా తోడుండే..’’
అంటూ సాగే ఈ పాటను ఏనుగు వెంకన్న(అన్వేష్) రచించగా బొమ్మకంటి కొమరయ్య గుండెను తాకేలా ఆలపించారు. పూర్తి గ్రామీణ వాతావరణంలో చేతికర్ర గొప్పతనాన్ని కళ్లకు కట్టేలా తిరుపతి దర్శకత్వం వహించారు. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు.