employee resigned after Rs 1.42 crore fell into his account in chili
mictv telugu

అకౌంటులోకి 1.42 కోట్లు.. రిజైన్ చేసి పారిపోయిన ఉద్యోగి

June 29, 2022

employee resigned after Rs 1.42 crore fell into his account in chili

ఈ మధ్య కొందరు వ్యక్తుల అకౌంటులోకి పొరపాటున కోట్ల రూపాయలు డిపాజిట్ అయిన ఘటనల గురించి విన్నాం. అయితే చాలా వరకు బ్యాంకులు అలాంటి వాటిని గుర్తించి ఆ సొమ్మును రికవరీ చేస్తుంటాయి. అయితే చిలీలో జరిగిన ఇలాంటి ఘటనలో మాత్రం సదరు వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించాడు. వివరాల్లోకెళితే.. దక్షిణ అమెరికాలోని చిలీ అనే దేశంలో ఓ ప్రముఖ మైనింగ్ సంస్థ ఉంది. ఆ కంపెనీలో వందలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వారికి నెలనెలా జీతాలు ఇచ్చే క్రమంలో కంపెనీ ఓ ఉద్యోగి అకౌంటులో జీతం రూ. 50 వేలకు బదులు రూ. 1. 42 కోట్లను పొరపాటున వేసింది. ఇంత మొత్తం చూసిన ఉద్యోగి షాక్ అయి, విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో అవాక్కయిన కంపెనీ అకౌంటు విభాగం వెంటనే ఆ డబ్బును కంపెనీ ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. అయితే మరుసటి రోజు కూడా డబ్బు రాకపోవడంతో ఉద్యోగిని ప్రశ్నించగా, రోజు మొత్తం అలసిపోయి పడుకున్నానని, తర్వాతి రోజు బ్యాంకుకు వెళ్లి జమ చేస్తానని నమ్మబలికాడు. తర్వాత రెండు రోజులైనా డబ్బు రాకపోవడంతో అనుమానం వచ్చిన అకౌంటు విభాగం వాళ్లు ఉద్యోగికి ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది. రూంకి వెళ్లి చూడగా, అతని జాడ లేకుండా పోయింది. అటు హెచ్ ఆర్ విభాగంలో తనిఖీ చేయగా, సదరు ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తేలడంతో మరోమారు అవాక్కవడం అకౌంటు వారి వంతైంది. ఉద్యోగి రాజీనామా చేసి అంత డబ్బుతో రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఈ విషయం మేనేజ్‌మెంటుకి తెలియడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు చేపట్టింది.