EMRI in Siddipet District is inviting applications for 108 Jobs
mictv telugu

ఎలాంటి రాతపరీక్ష లేకుండానే 108లో ఉద్యోగాలు భర్తీ…!!

February 12, 2023

 EMRI in Siddipet District is inviting applications for 108 Jobs

ఈఎంఆర్ఐ ( EMRI)ఎమర్జెన్సీ మేనేజ్‎మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ స్ట్యూటి 108లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనిలో భాగంగా సిద్ధిపేట జిల్లా పరిధిలోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ సలీం,కో ఆర్డినేటర్ కుమారస్వామి వెల్లడించారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఈపోస్టులకు దరఖాస్తు చేసుసుకునే అభ్యర్థులు బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీఫార్మసీ, డీఫార్మసీ, డీఎంఎల్ టీ పూర్తి చేసి ఉండాలి. ఇక అభ్యర్థుల వయస్సు 30ఏళ్లలోపు ఉండాలి. ఫైలెట్ ఉద్యోగానికి పది పాసైతే చాలు. ఎల్ఎంవీ బ్యాడ్జీ ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయస్సు 23 నుంచి 35ఏళ్ల లోపు ఉండాలి. ఈఆర్ఓ పోస్టుకు ఇంటర్ లేదా డిగ్రీ పాసై బేసిక్ కంప్యూటర్ పరిజ్ణానం ఉండాలి.

ఈఆర్ఓ పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులు హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. మిగిలిన ఉద్యోగాలు సిద్ధిపేట జిల్లా పరిధిలోనే చేయాలి. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్ తో ఈ నెల 13వ తేదీజి సిద్థిపేట జిల్లా ఎంసీహెచ్ స్వచ్చబడి మీటింగ్ హాల్ లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.