జమ్మూకశ్మీర్ లో మళ్లీ ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం - MicTv.in - Telugu News
mictv telugu

జమ్మూకశ్మీర్ లో మళ్లీ ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

July 13, 2020

police

భద్రతా దళాలు జమ్మూకశ్మీర్ లో ముష్కరుల వేట కొనసాగిస్తున్నాయి. ఈరోజు అనంత్‌నాగ్ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీగుఫ్వారా ప్రాంతంలోని పహల్ గాంలో ఉగ్రవాదులున్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. 

దీంతో వెంటనే రంగంలోకి దిగిన జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం కలిసి గాలిస్తుండగా ఉగ్రవాదులు ఎదురయ్యారు. వారిని లొంగిపొమ్మని భద్రతా దళాలు కోరాయి. అయినా కూడా ఉగ్రవాదులు వినకుండా భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.