శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

September 17, 2020

nbcv bn

జమ్మూకశ్మీర్‌లో గత కొన్ని నెలలుగా ముష్కరుల వేట కొనసాగుతోంది. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ముష్కరులను ఏరివేస్తునారు. అలాగే వారి స్థావరాలను నెల మట్టం చేస్తున్నారు. ఈరోజు ఉదయం బటమలూ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. 

దీంతో సీఆర్‌పీఎఫ్‌, జమ్మూకశ్మీర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో మొదట ఓ ఉగ్రవాది హతమయ్యాడు. తరువాత సెర్చ్‌ భద్రతా దళాలు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగించగా.. మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఆపరేషన్‌ను కొనసాగుతోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఓ పోలీస్ అధికారి గాయపడినట్లు తెలుస్తోంది.