శత్రువులు మసైపోయారు..వీడియో విడుదల: ఉక్రెయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

శత్రువులు మసైపోయారు..వీడియో విడుదల: ఉక్రెయిన్

February 26, 2022

 

fvfdbvfhn ht jjj

రష్యా గత రెండు రోజులుగా ఉక్రెయిన్ దేశంపై భీకరమైన బాంబులతో విరుచుకుపడుతూ.. ఇప్పటికే ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రష్యా మరో రెండు నగరాలను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైనికులు సైతం ‘తగ్గేదేలే’ అంటూ రష్యా సైనికులను మట్టుపెడుతున్నారు. ఈ క్రమంలో ఇర్పెన్‌లో రష్యాకు చెందిన పలు యుద్ధ ట్యాంకులను బాంబులతో పేల్చేశారు. ఆ ఘటనలో పదుల సంఖ్యలో రష్యా సైనికులు కాలి బూడిదయ్యారు. ఆ వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘మా భూభాగంలోకి ఎవరైనా చొరబడితే వారికి చావే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

మరోపక్క నాజీ ఆక్రమణదారులను గోస్టోమెల్ దగ్గర ఉక్రెయిన్ సైనికులు కాల్చేశారని రక్షణ శాఖ తెలిపింది. “వాళ్లు కాలిపోతున్నారు. చచ్చిపోతున్నారు. లొంగిపోతున్నారు. ఉక్రెయిన్ జిందాబాద్” అంటూ ల్యాండ్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 2,500 మంది దాకా రష్యా సైనికులు చనిపోయినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.