‘మామ.. లీవ్ లెటర్ సిద్ధం చేసుకో’ : ఇస్మార్ట్ హీరో రామ్ - MicTv.in - Telugu News
mictv telugu

‘మామ.. లీవ్ లెటర్ సిద్ధం చేసుకో’ : ఇస్మార్ట్ హీరో రామ్

May 26, 2019

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమాను జులై 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు హీరో రామ్ ప్రటించారు. ‘మామ.. లీవ్‌ లెటర్‌ సిద్ధం చేసుకో..’ అంటూ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ స్టైల్‌లో ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటించారు. పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై.. అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మాస్ లుక్ లో కనిపించిన రామ్.. డైలాగ్ డెలివరీ సినిమా మీద అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే జులై 12వ తేదీ వరకు ఆగాల్సిందే.