Enforcement directorate interrogates charmi and puri jagannath over investment in vijay devarakonda liger movie
mictv telugu

చార్మి, పూరిని విచారించిన ఈడీ అధికారులు

November 18, 2022

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్‌తో ‘లైగర్’ మూవీ నిర్మించిన ప్లాప్ చవిచూసిన చార్మి, పూరి జగన్నాథ్‌లు చిక్కుల్లో పడ్డారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) అధికారులు వారిద్దరిని గురువారం విచారించారు. పూరి బ్యాంకు ఖాతాల్లోకి భారీ ఎత్తున విదేశాల నుంచి డబ్బు జమ కావడంపై వందలాది ప్రశ్నలే సంధించి ఆరా తీశారు.

మీడియా కంటబడకుండా ఇద్దరినీ ఏకంగా 13 గంటలపాటు విచారించారు. పాన్ ఇండియాగా మూవీగా తెరకెక్కిన లైగర్ కోసం నల్లడబ్బును హవాలా, మనీలాండరింగ్ రూపంలో తీసుకొచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకుల హస్తం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్ గాడిలో పడిన పూరి అదే ఊపుతో విజయ్ దేవరకొండ ఇమేజే పెద్ద నమ్మకంగా లైగర్ తీశారు. జనానికి ఇది నచ్చకపోవడంతో విజయ్‌తో తీయాల్సిన మరో మూవీ కూడా ఆగిపోయింది.