నింగిలోని విమానంలో మంటలు.. అందులో 340 మంది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

నింగిలోని విమానంలో మంటలు.. అందులో 340 మంది (వీడియో)

November 22, 2019

Engine fire forces plane to make emergency landing in Los Angeles

అసలే విమానం.. దానికి ప్రమాదం జరిగినా అది కింద ఉన్నప్పుడు జరిగితేనే ప్రయాణికులు సురక్షితం. పైకి ఎగిరాక ప్రమాదాలు సంభవిస్తే వందల ప్రాణాలు హరీ అన్నట్టే. ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం గాల్లోకి ఎగరగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అటు ప్రయాణికులు, ఇటు విమాన సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఈ ఘటన గురువారం ఉదయం లాస్ ఏంజెల్స్‌లో చోటుచేసుకుంది. 

 

ఎయిర్‌లైన్స్‌ విమానం లాస్ ఏంజెల్స్ నుంచి ఫిలిప్పీన్స్‌కు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గాల్లో ఎగురుతున్నప్పుడు మంటలు చెలరేగడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు గుండెలు చిక్కబట్టుకున్నారు. అందులో 347 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు అత్యవసర ల్యాండింగ్‌ పేరిట విమానాన్ని కిందకు దించారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. విమానం ల్యాండ్ అవగానే ప్రయాణికులు అందరినీ సురక్షితంగా కిందికి దింపారు. ప్రమాదానికి గురైన విమానం113 బోయింగ్‌-777 రకానికి చెందినదని ఎయిర్ లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. విమానానికి మంటలు అంటుకోగానే గుర్తించిన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించి మాకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమయ్యామని పేర్కొన్నారు.